Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేగలు తినండి.. బరువు తగ్గండి..

తేగలు తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం తినకుండా వుండలేరు. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:05 IST)
తేగలు తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం తినకుండా వుండలేరు. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే తేగలను ఉడికించి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.. పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. తేగల పిండిని గోధుమ పిండిలా చేసి.. రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా వున్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా వున్నాయి. 
 
తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి మేలు చేస్తాయి. బ్లడ్ క్యాన్సర్‌కు తేగలు చెక్ పెడతాయి. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకున్నాయి. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పతుతుంది. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.
 
మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని తెల్లకణాలను వృద్ధిచేస్తుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. శరీరానికి చలవనిచ్చి.. నోటిపూతను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చెమటకాయలను తేగలు నివారిస్తాయి. 
 
తేగలను పాలలో ఉడికించి.. ఆపాలను చర్మానికి పూతలా వేసుకుంటే.. మంచి ఫలితం వుంటుంది. అలాగే తేగలను అధికంగా తీసుకోకూడదని.. రోజుకు రెండు తీసుకోవచ్చునని.. వారానికి ఐదారు తీసుకోవచ్చునని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేగానీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధిక మోతాదులో తీసుకుంటే.. కడుపునొప్పి ఏర్పడే అవకాశం వుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments