Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటి?

అల్లం చాలా ఉత్తమమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా వాతగుణం మీద అత్యద్భుతంగా పనిచేసే మహా ఔషధం చాలా రకాల వంటకాలలో దీనిని వాడటం భారతీయులకే చెల్లు. జీర్ణకోశ వ్యాధుల దగ్గర నుంచి సమస్త పైత్యపు లక్షణాలను, సమస్త వాతలక్షణాలనూ తొలగించే గుణం అల్లానికి ఉంది.

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (21:30 IST)
అల్లం చాలా ఉత్తమమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా వాతగుణం మీద అత్యద్భుతంగా పనిచేసే మహా ఔషధం చాలా రకాల వంటకాలలో దీనిని వాడటం భారతీయులకే చెల్లు. జీర్ణకోశ వ్యాధుల దగ్గర నుంచి సమస్త పైత్యపు లక్షణాలను, సమస్త వాతలక్షణాలనూ తొలగించే గుణం అల్లానికి ఉంది.
 
నోటికి సహించకపోవడం అరుచి ఉంటే అల్లాన్ని భోజనానికి ముందు తినాలి. ఇలా అల్లం తినడం వల్ల ఆహారం జీర్ణమవడమే కాక వాంతి వచ్చే స్థితికి కూడా తొలగిపోతుంది. అల్లాన్ని సన్నని చిన్న చిన్న ముక్కలుగా తరిగి లేదా మెత్తగా దంచినా సరే అందులో సైంధవ లవణం లేక మామూలు ఉప్పు అయినా సరే కలిసి రోజూ ఒక చెంచాను నిల్వ చేసుకోవాలి. దీనికి రోజూ చెంచాడు మోతాదులో అన్నంతో కలుపుకుని కొంచెం నెయ్యి వేసుకొని మొట్టమొదటి ముద్ద తినాలి. ఆ తరువాత మామూలుగా మనకు ఇష్టమైనది తినొచ్చు.
 
జీర్ణవ్యవస్థలో వాతపు లక్షణాలను అల్లం హరించి వేస్తుంది. దీని వల్ల మిగిలిన శరీరంపైన వాతపు లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి. పక్షవాతం వచ్చేటట్లు కనిపిస్తే వెంటనే నాలుగు చెంచాల అల్లపు రసం ఇవ్వాలి. ఈ విధంగా తరచుగా ఇస్తే పక్షవాతం రాకుండా ఉంటుంది. ఒకవేళ పక్షవాతం అప్పటికే వచ్చినా వ్యాధి ఉదృతంగా మారకుండా ఉంటుంది.
 
అల్లపు రసం కేవలం పక్షవాతానిఏ కాక మోకాలిపోట్లు, మడమశూల, సియాటికా అనే నడుపునొప్పిని కూడా నివారిస్తుంది. ఇంకా శరీరంలో ఇతర జాయింట్లలో వచ్చే నొప్పులను కూడా అరికడుతుంది. అల్లం జీర్ణవ్యవస్థపై పనిచేస్తుంది. సుఖ విరేచనానికి అల్లానికి మించినది లేదు. ఆయుర్వేద వైద్య విధానంలో విరేచనాన్ని కలిగించే వ్యాధుల్ని నయం చేయడం అనే పద్ధతిగా కూడా ఒకటి ఉంది. అల్లం చేసే పని కూడా అలాంటిదే. అయితే అల్లం విరేచనాల్ని సాఫీగా అయ్యేట్లు చేస్తుంది. అంతేగానీ ఇది విరేచనకారి కాదు. అల్లం కంఠాన్ని శుద్థి చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
 
నాలుకపైన కంఠంలో ఏదో ఉండపెట్టినట్లు ఉండడంతో పాటుగా నోటికి రుచి తెలియపోవడాన్ని కూడా అల్లం పోగొడుతుంది. భోజనంలో అల్లం గనుక ఉంటే భోజనానంతరం కనిపించే భుక్తా యాసం అనేది కనిపించదు. అల్లం అతిగా తింటే వేడి చేస్తుంది. పరిమితంగా అల్లాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులకు పట్టిన కఫం కరిగిపోతుంది. జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఇంకా ఇతర ఎలర్జీ లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి.
 
అల్లాన్ని బెల్లాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా దంచి చిన్న కుంకుడు కాయ సైజులో ఉండలు చేసుకుని పూటకు ఒకటి లేక రెండు వుండల్ని తింటే ముక్కు నుంచి ధారాపాతంగా నీరుకారుతూ ఉండే జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబుతో పాటుగా దగ్గు కూడ ఉండే జలుబు కూడా తగ్గిపోతుంది. జలుబుతో పాటుగా దగ్గు కూడా ఉంటే మిరియాలు కూడా వీటితో పాటు కలిపి దంచి కలిపి ఇవ్వవచ్చు. వేడి చేయనంత కాలం వీటిని ఈ విధంగా వాడుకోవచ్చు. 
 
లివర్‌ ఎన్‌లార్జిమెంట్‌ ఉన్న వారు కడుపునొప్పితో బాధపడేవారు. కడుపులో మంట ఉన్న వారు లివర్‌ వ్యాధులు ఉన్న వారు రక్తహీనత ఉన్న వారు అల్లాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. క్షయ వ్యాధి ఉన్న వారు అల్లం ప్రతిరోజు వాడితే క్షయ వ్యాధి తగ్గుతుంది.
 
సోరియాసిస్‌ అనే చర్మవ్యాధిలో చర్మం పొలుసుగా పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. అల్లమును దానికి సమాన పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే సోరియాసిస్‌ వ్యాధిలో వచ్చే ఎలర్జీ లక్షణాలు తొలగిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments