Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరేణి రసంతో పొట్ట కొవ్వు తగ్గిపోతుందా?

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (23:21 IST)
ఉత్తరేణి. ఆయుర్వేదంలో ఈ మొక్కకి చెందిన ఆకులు, బెరడును ఉపయోగిస్తుంటారు. ఉత్తరేణి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉబ్బసంతో బాధపడేవారికి ఉత్తరేణి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
 
ఉత్తరేణి గింజలు, మిరియాలు మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని తుమ్మజిగురులో నానబెట్టి నూరి శనగ గింజంత తీసుకుంటే ఫలితం వుంటుంది.
 
ఉత్తరేణి వేర్లు, కుప్పింట చెట్టు వేళ్లు మెత్తగా నలగ్గొట్టి నూలుబట్టలో వేసి వాసన చూస్తుంటే చలిజ్వరం తగ్గుతుంది.
 
ఉత్తరేణి ఆకులు, మిరియాలు, సహదేవి చెట్టు వేర్లు పైతోలు కలిపి మెత్తగా నూరి మిరియాల గింజలంత గోలీలుగా చేసి తింటే బక్కగా వుండేవారు బలిష్టమై వృద్ధి చెందుతారు.
 
ఎర్ర ఉత్తరేణి ఆకు రసం, ఆవునెయ్యితో కలిపి తీసుకుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.
 
ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై రసం అంతా ఇగిరిపోయేట్లు చేసి మిగిలిన నూనెను రోజుకి ఒకసారి పొట్టపై మర్దిస్తే బానపొట్ట తగ్గుతుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు మోతాదు విషయమై ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments