Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్‌కు చెక్ పెట్టే.. కరివేపాకు కషాయం.. ఎలా చేయాలంటే? (video)

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (10:55 IST)
కరివేపాకు పొడి వంద గ్రాములు, 25 గ్రాముల శొంఠి  పొడి, కరక్కాయ పొడి 50 గ్రాములు తీసుకుని కలుపుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ అరస్పూన్ మేర ఈ పొడిని గ్లాసుడు వేడినీటిలో మరిగించి రోజూ రెండుపూటలా తీసుకుంటే.. రక్తశుద్ధికి ఉపకరిస్తుంది. శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. 
 
అజీర్తిని దూరం చేసుకోవాలంటే.. వాత, పిత్త, కఫానికి సంబంధించిన రోగాలకు చెక్ పెట్టాలంటే.. కరివేపాకును తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కరివేపాకును నేతిలో వేయించి అందులో రెండు మిరపకాయలు, చింతపండు నిమ్మ పండంత, ఉప్పు చేర్చి పచ్చడిలా తయారు చేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. వేవిళ్లు, అజీర్తిని ఇది నయం చేస్తుంది. కరివేపాకు పొడి, గోరింటాకును బాగా పేస్టులా రుబ్బుకుని తలకు పట్టిస్తే జుట్టు నెరవదు. 
 
కరివేపాకు, శొంఠి, జీలకర్ర, ఉల్లి వంటి వాటిని సమపాళ్లలో తీసుకుని దోరగా వేయించి పొడి కొట్టుకుని, ఆ పొడిని రోజూ నేతితో వేడి అన్నంలో కలుపుకుని తింటే మలబద్ధకం వుండదు. కరివేపాకు పొడిని రోజూ రెండు స్పూన్ల మేర తీసుకుంటే దగ్గు, జలుబు మటాష్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మునగకాడలు, కరివేపాకు కాడలు, ఉసిరి కాడలు తలా ఒక్కో గుప్పెడు తీసుకుని, శొంఠి, మిరియాలు, జీలకర్ర 20 గ్రాముల మేర తీసుకుని.. వీటిని పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వైరస్, బ్యాక్టీరియాకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments