Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పాత్రల్లో నీళ్లు దంపతులు తాగితే?

రాగి చెంబులో నీటిని సేవించడం ద్వారా శరీరంలోని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాగి చెంబు యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. శరీరంలోని రోగకారకాలను దూరం చేస్తుం

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (14:28 IST)
రాగి చెంబులో నీటిని సేవించడం ద్వారా శరీరంలోని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాగి చెంబు యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. శరీరంలోని రోగకారకాలను దూరం చేస్తుంది. రాగి చెంబుతో నీటిని సేవించడం, రాగి పాత్రల్లో ఆహారం తీసుకోవడం ద్వారా జ్వరం, జలుబు దరిచేరదు. నరాల వ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది. 
 
గాయాలైన చోట రాగి నాణేలను ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు త్వరగా మానిపోతాయి. అదేవిధంగా రాగితో చేసిన గాజులు ధరించడం ద్వారా ఇన్సోమ్నియా, న్యూరోసిస్, హైబీపీని నియంత్రించుకోవచ్చు. వివాహం అయిన తర్వాత సంతానలేమితో ఇబ్బందులు ఎదుర్కొనే దంపతులు.. రాగి చెంబులు, గ్లాసులు ఉపయోగించడం మేలు. వంటలు చేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించవచ్చు. తద్వారా దంపతుల శరీరంలో సంతానలేమి గల రుగ్మతలు తొలగిపోతాయి. 
 
రాగి చెంబులో రాత్రి పూట నీరు ఉదయం నిద్రలేవగానే తాగడం చాలా మంచిది. అలా తాగితే కడుపులో వున్న టాక్సిన్లు తొలగిపోతాయి. తద్వారా గ్యాస్, కిడ్నీ, లివర్ సమస్యలు తగ్గిపోతాయి. రాగి పాత్రల్లో నీటిని వేడిచేసి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మ సంబంధిత రోగాలు దరిచేరవు. రాగిపాత్రల్లో నీళ్లు వుంచితే వాటిలో క్రిములు చేరే అవకాశం ఉండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
రాగి చెంబులో వుంచిన నీటిని తాగడం ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నయం అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. నిత్యయవ్వనులుగా వుంటారు. హృద్రోగ సమస్యలు ఉత్పన్నం కావు. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ క్రమంగా వుంటాయి. థైరాయిడ్ సమస్యలు దూరం చేసుకోవచ్చు. మెదడుకు ఆరోగ్యం. 
 
అయితే రాగి పాత్రల్లో నిల్వ వుంచిన నీటిని ఏడాది మొత్తం తాగకూడదు. మూడు నెలల పాటు రాగి పాత్రల్లో నిల్వ వుంచిన నీటిని తాగితే.. ఆపై నెల పాటు బ్రేక్ ఇవ్వండి. నెల పూర్తయ్యాక మళ్లీ రాగి పాత్రల్లో నిల్వ వుంచిన నీటిని మరో మూడు నెలల పాటు తాగడం మొదలెట్టండి. ఇలా చేస్తే శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి. శరీరంలో అధికంగా కాపర్ నిల్వ వుండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments