టాబ్లెట్ మింగకుండానే.. జలుబు మటాష్.. ఎలా..? ఇదిగోండి సింపుల్ చిట్కా..

చలికాలం వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని జలుబు ఆవహిస్తుంది. జలుబుకు జ్వరం కూడా తోడవుతుంది. అలాంటి వారు మీరైతే ఈ చిట్కా పాటించండి. జలుబును దూరం చేసుకోవాలం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (15:52 IST)
చలికాలం వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని జలుబు ఆవహిస్తుంది. జలుబుకు జ్వరం కూడా తోడవుతుంది. అలాంటి వారు మీరైతే ఈ చిట్కా పాటించండి. జలుబును దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాను పాటిస్తే సరిపోతుంది. మూడు నిమ్మకాయలను తీసుకుని.. వాటిని సగానికి కట్ చేసి ఓ పాత్రలో వేసుకుని అందులో నాలుగు గ్లాసుల నీరు చేర్చండి. 
 
ఈ నిమ్మకాయలకు కాసింత ఉప్పు కూడా చేర్చుకోండి. ఆపై నిమ్మకాయ, నీరు, ఉప్పుతో కూడిన పాత్రను స్టౌ మీద పెట్టి మరిగించండి. ఇంకా నాలుగు గ్లాసుల నీరు రెండు గ్లాసులయ్యేంత వరకు మరిగాక స్టౌ ఆఫ్ చేయండి. ఆపై పాత్రలో నీటిలో మరిగిన నిమ్మకాయలను తీసి రసం పిండుకుని మరిగించిన నీటితో కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు సేవిస్తే.. జలుబు మటాష్ అయినట్లే. ఈ కషాయాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని మలినాలు స్వేదం ద్వారా వెలివేయబడతాయని.. జలుబు కూడా తగ్గిపోతుందని.. తద్వారా జలుబు కోసం టాబ్లెట్లు మింగాల్సిన పని ఉండదంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments