Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరతో కంటి మంట మటాష్.. ఎలా?

కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి మంటను కొత్తిమీర తగ్గిస్తుంది. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను కొత్తిమీర దూరం చేస్తుంది.

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (12:02 IST)
కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి మంటను కొత్తిమీర తగ్గిస్తుంది. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను కొత్తిమీర దూరం చేస్తుంది. ఉసిరికాయ, కొత్తిమీర జ్యూస్‌ను తీసుకుని.. అరగ్లాసుడు తీసుకుని అందులో తేనె కలుపుకుని తాగితే కంటి మంట తగ్గిపోతుంది. ఈ మిశ్రమం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
 
రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను ఇది తొలగిస్తుంది. తద్వారా గుండెజబ్బుల నుంచి కాపాడుకోవచ్చు. మోకాళ్ల నొప్పులను కొత్తిమీర జ్యూస్ నయం చేస్తుంది. కొత్తిమీర తరుగును ఆహారంలో చేర్చుకోవడం లేదంటే కొత్తిమీర జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా ఇన్పెక్షన్లు దూరమవుతాయి. ఇంకా నరాల వ్యవస్థకు మేలు చేస్తాయి.
 
కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. కొత్తిమీర రసాన్ని రోజూ అరగ్లాసుడు తీసుకుంటే నోటిపూత, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలుండవు. కొత్తిమీర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
 
ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన కె-విటమిన్ కొత్తిమీరలో లభిస్తాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కిడ్నీ రాళ్లు ఏర్పడడం వల్ల ఏర్పడే రుగ్మతలను కొత్తిమీర దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments