Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఆముదాన్ని వేడి చేసి ఇలా వాడితే..?

Webdunia
గురువారం, 2 జులై 2020 (13:28 IST)
ఆముదం వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి రాసుకోవడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. ఆముదాన్ని వేడి చేసి చర్మానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మంపై వున్న మృతణాలు తొలగిపోతాయి. మెరిసే చర్మం పొందవచ్చు. అలాగే వేడి చేసిన ఆముదమును రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి.. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేస్తే .. పగిలిన పాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
కొంత మందికి చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు పడుతాయి. అలా ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితం వుంటుంది. నిత్యయవ్వనులుగా వుంటారు. అలాగే ఆముదముతో.. బేకింగ్ సోడా కలిపి మచ్చలపై రాస్తే.. చర్మంపై ఉన్న మచ్చలు తొలిగిపోతాయి. చర్మంపై గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి మంచి మాయిశ్చ్చరైజర్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఆముదం నూనెను ఉపయోగించాలి. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఆముదం నూనెలో రెండు చుక్కల కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు తగ్గటమే కాక జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments