Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరచు పసుపు తీసుకుంటే బరువు తగ్గుతారా..?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (10:12 IST)
పసుపు వంటకాల్లో ఎక్కువగా వాడే పదార్థం. ఈ పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ప్రతిరోజూ మనం చేసుకునే కూరల్లో పసుపు వేసుకుంటే ఆ రుచేవేరు. తరచు దీనిని ఉపయోగిస్తే కడుపులోని ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. పసుపులోని మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. పసుపులో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకుని చర్మానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తాజాగా మారుతుంది. 
 
2. రాత్రివేళలో గ్లాస్ గోరువెచ్చని పాలలో స్పూన్ కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే చక్కని నిద్ర పడుతుంది. పసుపులోని యాంటీ ఇఫ్లమేటరీ గుణాలు శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. క్రమంగా పసుపు నీటిలో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 
 
3. పసుపు చెక్కలను ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిని రోజూ వంటకాల్లో చేర్చుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆయుర్వేదంలో తెలియజేశారు. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 
 
4. బరువు తగ్గాలనుకునేవారు నూనెలో కప్పు ఉల్లిపాయలను వేయించి అందులో స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత రెండు కరివేపాకు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల తరువాత దించేయాలి. ఇలా చేసిన మిశ్రమంలో వేడివేడి అన్నం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గుతారు. అంతేకాదు, శరీరానికి కావలసిన ఎనర్జీనీ అందుతుంది. 
 
5. కండరాలు, ఎముకలు బలంగా ఉండాలంటే.. పసుపు క్రమంగా తీసుకోవాలి. అలానే పసుపులో కొద్దిగా నిమ్మరసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments