Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నూనెలో మల్లెపువ్వులు నానబెట్టి ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (13:38 IST)
మల్లెపువ్వులంటే నచ్చని స్త్రీలుండరు. సాధరణంగా చాలామంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మల్లెపువ్వులు తప్పకుండా పెట్టుకునే వెళ్తారు. వాటి వాసనే అందరిని పరిమలింపజేస్తుంది. మరి మల్లెపువ్వుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. మల్లె వాసన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణులు వాంతుల కారణంగా తిన్న ఆహారాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో చూద్దాం.. మల్లెపువ్వు వాసన పీల్చుకుంటే చాలు వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
కొబ్బరి నూనెలో కొన్ని మల్లెపువ్వులు వేసి ఓ రాత్రంతా నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే ఆ నూనెను బాగా మరిగించుకుని తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన మాడుకు చల్లదనం చేకూరుతుంది. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుకుని పనిచేసిన వారికి కళ్ళు అలసట ఉంటాయి. అలాంటప్పుడు మల్లెపువ్వులను కాసేపు కళ్ళపై ఉంచినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. 
 
మల్లెపువ్వుల రసంలో కొద్దిగా రోజ్ వాటర్, గుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. అలానే ముల్తానీ మట్టిలో కొద్దిగా గంధం, తేనె, మల్లెపువ్వుల పేస్ట్ కలిసి ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి.   
 
తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు నానబెట్టిన మెంతులలో కొన్ని ఎండు మల్లెపువ్వులు వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య ఉండదు. దాంతో పాటు జుట్టు పట్టు కుచ్చులా మెరిసిపోతుంది. మల్లెపువ్వులను పేస్ట్ చేసి ఆ మిశ్రమంలో కొద్దిగా పాలుక కలిపి ముఖానికి రాసుకుంటే ముడతల చర్మం పోతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments