Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయంటే?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (18:44 IST)
మేష రాశి: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 5, వ్యయం: 5, రాజపూజ్యం: 3, అవమానం: 1
 
ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సంకల్పసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. ఆదాయం బాగున్నా సంతృప్తి అంతగా ఉండదు. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తకుండా జాగ్రత్తగా మెలగాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖరీదైన వస్తువులు, నగదు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య తరచు కలహాలు తలెత్తుతాయి. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శుభయోగం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభించదు. విత్తన, ఎరువుల వ్యాపారులకు కష్టకాలం. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి బాగుంటుంది. ఆప్తుల గురించి ఆందోళన చెందుతారు.
 
ఈ రాశివారికి వరసిద్ధి వినాయక ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.

 
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 6, అవమానం: 1
 
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారానుకూలత అంతగా ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అక్టోబర్ మాసం తదుపరి నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. బంధుమిత్రులు మీ ఉన్నతికి సహకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులకు కష్టకాలం. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వైద్య, న్యాయ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. గృహ నిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. కార్మికులకు పనులు లభిస్తాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. తరచు వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
సుబ్రహ్మణ్య్వేరుని ఆరాధన, శనికి తైలాభిషేకాలు ఈ రాశివారికి మంచి ఫలితాలిస్తాయి.
 
మిథున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం: 2, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం: 4 
ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలదాయకమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. వాహనం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరీ సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విద్యార్థులు పట్టుదలతో శ్రమించిన గాని ర్యాంకులు సాధ్యం కావు. దూర ప్రదేశాల్లోనే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్‌సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి. అధికారులు, ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో తరచుగా పాల్గొంటారు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
ఈ రాశివారికి కనకదుర్గమ్మ ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం శుభదాయకం.
 
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 11, వ్యయం: 8, రాజపూజ్యం: 5, అవమానం: 4
ఈ రాశి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. మీ శ్రీమతి తరఫు వారి నుంచి ధనలాభం ఉంది. మీ చొరవతో బంధువుల ఇంట శుభకార్యం నిశ్చయమమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. విద్యార్థులకు కృషి, పట్టుదల ప్రధానం. ర్యాంకుల సాధనకు అవిశ్రాంతంగా శ్రమించాలి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. అధికారులకు స్థానచలనం, హోదామార్పు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ విషయంలో అవస్థలు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం అమర్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. విదేశీయాన యత్నం ఫలించదు. బిల్డర్లు, భవన నిర్మాణ కార్మికులకు ప్రోత్సాహకరం.
 
రాహు కేతువుల దోష నివారణలు, శివారాధనలు ఈ రాశివారికి శుభం, జయం.
 
సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 14, వ్యయం: 2, రాజపూజ్యం: 1, అవమానం: 7
 
ఈ రాశివారికి సప్తమ స్ధానంలో శని సంచార ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. ఆదాయం బాగుంటుంది. మెరుగైన ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపు పథకాలకు అనుకూలం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం మూలకంగా ఇబ్బందులు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిర్మాణాలు, గృహ మరమ్మతులు చేపడతారు. సిమెంటు, ఇసుక, ఐరన్ వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి పంట దిగుబడి బాగుంటుంది. గిట్టుబాటు ధర ఏమంత సంతృప్తినీయదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. వీసా, పాస్‌పోర్టులు మంజూరవుతాయి.
 
ఈ రాశివారికి మూడు నెలలకొకసారి శనికి తైలాభిషేకం, శివుని ఆరాధన శుభదాయకం.
 
కన్య: రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆదాయం: 2, వ్యయం: 11, రాజపూజ్యం: 4, అవమానం: 7
 
ఈ రాశి వారికి షష్టరాశిలో శని సంచారం యోగదాయకం. ఎటువంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ పట్టుదల ఎదుటివారికి స్ఫూర్తిదాయకమవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం కొంతమందికి అపోహ కలిగిస్తుంది. వ్యవహార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సంఘటనలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. గృహమార్పు లేదా స్థానచలనం అనివార్యం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. తరచు అనారోగ్యానికి గురవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. స్సెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.
 
తులా రాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 7, అవమానం: 7
 
ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది. సంకల్పసిద్ధి, సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. స్థిరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పెట్టుబడులు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ఆరోగ్యం జాగ్రత్త. నరాలు, కంటి, దంత వైద్య సమస్యలెదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. ర్యాంకుల సాధనకు కృషి, పట్టుదల ప్రధానం. వ్యవసాయ రంగాల వారికి కూలీలతో సమస్యలు తప్పవు. అయిన కాడికి పంట అమ్ముకోవలసి వస్తుంది. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. తరచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
సిద్ధి వినాయకుని ఆరాధన, శనికి తైలాభిషేకం ఈ రాశివారికి శుభం, జయం.
 
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం: 5, వ్యయం: 5, రాజపూజ్యం: 3, అవమానం: 3
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవహార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. ఆర్ధికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. శని సంచార సమయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత వివాహం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో అప్రమత్తంగా ఉండాలి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విద్యార్థులకు ఓర్పు, ఏకాగ్రతతో శ్రమించిన గాని ర్యాంకులు సాధించలేరు. దంపతుల మధ్య అకారణ కలహాలు, అనారోగ్యం తప్పవు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
శివార్చనలు, రుద్రాభిషేకాలు, శనికి తైలాభిషేకాలు ఈ రాశివారికి శుభం కలుగచేస్తాయి.
 
ధనుస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం- 8, వ్యయం- 11, రాజపూజ్యం- 6, అవమానం- 3
ఈ రాశివారికి శని సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పసిద్ధి, వివాహయోగం ఉన్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. రుణ సమస్యలు సద్దుమణుగుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనుకునే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పెద్దల సలహా తీసుకోండి. నూతన దంపతుల మధ్య అవగాహన, అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. రాహు ప్రతికూల సంచారం వల్ల శ్రమాధిక్యత, ఒత్తిడి అధికంగా ఉంటాయి. అయితే ఓర్పుతో వీటిని అధిగమిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభించదు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. అనుభవం ఉన్న రంగాల్లోనే పెట్టుబడులు పెట్టం మంచిది. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ కాగలదు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థుల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. తరుచు దైవ, శుభ కార్యాల్లో పాల్గొంటారు.
 
సంకల్పసిద్ధికి శివదర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శభదాయకం.
 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 6.
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో విబేధిస్తారు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్థిరచరాస్తుల కొనుగోలుకు తగిన సమయం. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను నమ్మవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి ఉపాధ్యాయ పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులు తరచు యూనియన్ సమావేశాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దూర ప్రదేశంలో వీరికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదువులు దక్కవు. నిర్మాణ రంగాల వారికి ఆశాజనకం. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. కోర్టు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
ఈ రాశివారికి వరసిద్ధి వినాయకుని ఆరాధన, లలితా సహస్ర నామ పారాయణం శుభఫలితాలిస్తాయి.
 
కుంభ రాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 6
 
ఈ రాశివారికి వ్యవహారాలు, రోజువారీ కార్యక్రమాలు ఇబ్బందికరంగా సాగుతాయి. ఏలిననాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. సంకల్పసిద్ధికి ఓర్పు, దీక్ష ప్రధానం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వాస్తుదోష నివారణ చర్యలు ఆశించిన ఫలితమిస్తాయి. ఉపాధ్యాయులకు కష్టసమయం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అవివాహితులు శుభవార్తలు వింటారు. హోల్‌సేల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. వాతావరణంలో మార్పులు ఆందోళన కలిగిస్తాయి. వాహన ప్రమాదాలు, ప్రయాణంలో ఆటంకాలెదురవుతాయి.
 
ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకం.
 
మీన రాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం: 8, వ్యయం: 11, రాజపూజ్యం: 1, అవమానం: 2
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంది. ఏలిన నాటి శని సంచారం విషయంలో ఆందోళన తగదు. గురుబలంతో నెట్టుకొస్తారు. రాహువు సంచారం కూడా అనుకూలిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పెట్టుబడులు కలిసివస్తాయి. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. పారిశ్రామిక రంగాల వారికి అభ్యంతరాలెదురవుతాయి. ఉద్యోగస్తులు, అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. ఆశించిన టెండర్లు, ఏజెన్సీలు దక్కవు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. తరచు దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ఈ రాశివారికి ప్రదోష కాలంలో శివునికి ప్రదక్షిణలు, దత్తాత్రేయుని ఆరాధన శుభసూచకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments