Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-03-2024 నుంచి 06-04-2024 వరకు వార రాశి ఫలాలు...

రామన్
శనివారం, 30 మార్చి 2024 (22:43 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయం అంతంత మాత్రమే. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. స్థిమితంగా ఉండండి. ఆప్తులకు మీ సమస్య చెప్పుకుంటే పరిష్కారం గోచరిస్తుంది. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. ధైర్యంగా యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ పట్టుదలే విజయానికి సంకేతం. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనలు సావకాశంగా పూర్తిచేస్తారు. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. దంపతులకు కొత్త ఆలోచను స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఒతిళ్లకు లొంగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు, విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ధనయోగం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహర లావాదేవీల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యకం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు అధికం. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉన్నాయి. పాతమిత్రులు తారసపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మంగళవారం ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు సమస్యలెదురవుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ప్రశాంతంగా ముగుస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. తాకట్లు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లౌక్యంగా మెలగండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పంతాలకు పోతే ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, శనివారాల్లో ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. సమష్టికృషితోనే అనుకున్నది సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. మంగళవారం నాడు ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. కొత్త వ్యాపారాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం. రిప్రజెంటేటివ్‌లు లక్ష్యాలను పూర్తిచేయగలుగుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. పనులు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పరిచయస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ధనయోగం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. కొన్ని సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమవారం నాడు పొగిడే వారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. భేషజాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఏది జరిగినా మంచికేనని భావించండి. త్వరలో మీ కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అధికారులు, ఉపాధ్యాయులకు కష్టసమయం. వృత్తుల వారికి పురోభివృద్ధి. సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

గురువారం అక్టోబర్ 31న తిరుమల విఐపి దర్శనం రద్దు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments