Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-05-2022 నుంచి 28-05-2022 వరకు మీ వారఫలాలు

Webdunia
శనివారం, 21 మే 2022 (20:05 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల ప్రోత్సాహంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సోమ, మంగళవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం విజయం ఉత్తేజాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లకు కష్టకాలం. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బుధవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కళ్లు, దంతాలకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. శుక్ర, శనివారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పరిచయాలు బలపడతాయి. కీలక పత్రాలు, అందుకుంటారు. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధార్మిక, యోగ విషయాలపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. మంగళ, బుధవారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్పుబాటవుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. ప్రయాణంలో జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆర్థిక లావాదేవీలతో తలమునకలవుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగిచండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. శనివారం నాడు ఏ పనీ సాగదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సాంకేతిక, న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఈ వారం అనుకూలదాయకమే. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలకు పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
మీదైనరంగంలో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. ఆది, సోమవారాల్లో ఖర్చులు అధికం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మంగళవారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రతిపాదనకలు ఆమోదం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు నిరుత్సాహకరం. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సావరాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. బుధ, గురువారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments