Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-12-2022 నుంచి 17-12-2022 వరకు మీ వార రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (11:19 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఈ వారం అనుకూలదాయకం. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పెద్దల సలహా పాటిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆప్తులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ధైర్యంగా వ్యవహరిస్తారు. సాహసించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వేడుకల్లో అతిగా వ్యవహరించవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
మనస్థిమితం ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అనుకూలతలున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. గురు, శుక్ర వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. శనివారంనాడు అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా తీసుకోండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యవహారదక్షతతో రాణిస్తారు. వ్యతిరేకులు చేరువవుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు లోటుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. సోమ, మంగళ వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వస్త్ర, కిరాణా వ్యాపారాలు ఊపందుకుంటాయి షాపు పనివారలతో జాగ్రత్త. నూతన పెట్టుబడులకు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అధికం. రావలసిన ధనం అందుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. బుధ, గురు వారాల్లో విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, వైద్యరంగాల వారి ఆదాయం బాగుంటుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. పందాలు బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆచితూచి వ్యవహరించండి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథరాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. శుక్ర, శని వారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొండుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు సరుకు నిల్వలో జాగ్రత్త. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments