Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-06-2020 నుంచి 04-07-2020 వరకు మీ వార రాశి ఫలితాలు..

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (20:23 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. గురు, శుక్రవారాల్లో బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. బాధ్యతగా వ్యవహరించాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. అనునయంగా సమస్యలు బాధ్యతగా వ్యవహరించాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు
మీ సమర్థతకై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే రాణిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు స్వీకరిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గత తప్పిదాలు పునరావృత్తమయ్యే సూచనలున్నాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రయాణం తలపెడతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవడం ఉత్తమం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, స్థానచలనం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. ఆలోచనలు నిలకడగా వుండవు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతకాలు, నగదు వ్యవహారంలో జాగ్రత్త. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, ఒత్తిడి, అకాల భోజనం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అయిన వారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతి సలహాతో అడుగు ముందుకేయండి. పిల్లల చదువులపై శ్రద్ధ అవసరం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుని మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. దైవకార్యం, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణయత్నాలు సాగిస్తారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. పనులతో సతమతమవుతారు. శనివారం ప్రముఖుల దర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పులు వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఓర్పుతో వ్యవహరించండి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వ్యవహారానుకూలత వుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు ధనలాభం, పదోన్నతి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
మీ కష్టం వృధా కాదు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారాలతో తీరిక వుండదు. అకాల భోజనం. విశ్రాంతి లోపం. బుధవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అనుకూలతలు అంతంత మాత్రమే. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో నిర్లక్ష్యం తగదు. ఇంటి విషయాలు పట్టించుకోండి. అవివాహితులకు నిరుత్సాహం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
ఈ వారం ఆశాజనకం. మీరు ఏం రంగంలోనైనా రాణిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడిగా ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర జోక్యం తగదు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులతో వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు, కొత్త బాధ్యతలు తప్పవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలున్నాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం వుంది. సమర్థతను చాటుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం.  పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. అధికారులు, ఉపాధ్యాయులకు స్థానచలనం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. దైవ కార్యంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments