Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-09-2004 నుంచి 28-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

రామన్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (16:38 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధృఢసంకల్పంతో అడుగుముందుకేయండి. యత్నాలు విరమించుకోవద్దు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు చేపడతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. మానసికంగా స్థిమితపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. శుక్ర, శనివారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పాతమిత్రులతో సంభాషిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ద్విచక్రవాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. లావాదేవీలతో తీరిక ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయం రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. అంతరంగి విషయాలు గోప్యంగా ఉంచండి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, పురస్కారయోగం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. సమష్టి కృషితో విజయం సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై గురి కుదురుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం ప్రతికూలతలు అధికం. ముఖ్యమైన వ్యవహారాలు కొంతకాలం వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సంతానం కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దు. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆర్యోం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. ఆత్మస్థైర్యంతో శ్రమిస్తే విజయం తధ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆశావహదృక్పధంతో మెలగండి. శుక్రవారం నాడు బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. చెల్లింపుల విషయంలో అలక్ష్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. గృహనిర్మాణానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉన్నతాధికారులకు హోదామార్పు. ప్రయాణంలో ఇబ్బందులు పడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments