Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-11-2023 నుంచి 25-11-2023 వరకు మీ వార ఫలితాలు..

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (14:25 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయాలి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. మంగళవారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఓర్పుతో ఉద్యోగ యత్నాలు సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆది, సోమవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకం. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. బంధుత్వాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ ఉన్నతిని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. గృహమార్పు అనివార్యం. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. బంధుమిత్రులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పనులు సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమర్మతులు చేపడతారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పవడద్దు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యవహారదక్షతతో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆదివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు, పనిభారం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడతుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ధనలాభం. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. శుక్ర, శనివారాల్లో పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. అయిన వారితో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
వాగ్ధాటితో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం గ్రహాల సంచారం బాగుంది. అనుకున్నది సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆహ్వానం అందుకుంటారు. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు నిరాశాజనకం. ప్రయాణాలు ప్రశాంతంగా పూర్తిచేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. గుట్టుగా మెలగండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులకు తరుణం కాదు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. జాతక పొంతన ప్రధానం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్యాటరింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments