Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016 ఫిబ్రవరి తదుపరి అదృష్టం మీ తలుపు తడుతుంది(ఎం. ప్రవీణ్ కుమార్-ఖమ్మం)

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2015 (21:39 IST)
ఎం. ప్రవీణ్ కుమార్-ఖమ్మం: మీరు చవితి గురువారం, సింహ లగ్నము, మూలా నక్షత్రం ధనుర్ రాశి నందు జన్మించారు. మీరు కార్పొరేట్ సంస్థలలో బాగుగా రాణిస్తారు. 2022 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించి అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. 2016 ఫిబ్రవరి తదుపరి అదృష్టం మీ తలుపు తడుతుంది. సద్వినియోగం చేసుకోండి.

ప్రతిరోజూ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2013 జులై నుంచి రవి మహర్దశ ప్రారంభమైంది. ఈ రవి 2016 మే నుంచి 2019 జూలై వరకు యోగాన్ని ఇవ్వగలడు. తదుపరి చంద్ర మహర్దశ 10 సంవత్సరములు కుజ మహర్దశ 7 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. జాతి కెంపు అనే రాయిని 5 క్యారెట్లు ధరించినా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరగలదు. ఉద్యానవనాలలో వేగి చెట్టును నాటిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.'
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

Show comments