విదేశాలలో కంటే స్వదేశంలో మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు(పి.కిషోర్-శ్రీకాకుళం)

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2016 (16:32 IST)
పి.కిషోర్-శ్రీకాకుళం: మీరు దశమి మంగళవారం వృశ్చిక లగ్నం, ఆశ్రేష నక్షత్రం, కర్కాకట రాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, ధన స్థానము నందు కేతువు ఉండి అష్టమ స్థానము నందు రాహువు ఉండటం వల్ల కర్కోటక కాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన శుభం కలుగుతుంది. ఈ దోషం వల్ల ధనం ఎంత వచ్చినా నిలబెట్టలేకపోవడం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
వర్తమాన కాలం మీకు అనుకూలంగా ఉంది. విదేశాలలో కంటే స్వదేశంలో మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. మీ పేరుతో ఏజెన్సీ, సంస్థలు, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్‌కు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. 2017 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. ప్రతిరోజూ సత్యనారాయణ స్వామిని పూజించి ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది. వైష్ణవ దేవాలయాలలో బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?

03-03-2026 మంగళవారం ఫలితాలు - కష్టానికి తగిన ప్రతిఫలం ఖాయం..

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

Show comments