Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు(జి.ప్రవీణ్-ఖమ్మం)

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (21:28 IST)
జి.ప్రవీణ్-ఖమ్మం: మీరు చవితి శనివారం, మిథున లగ్నం, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. 2017 వరకూ అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని గులాబీ పూలతో శనిని పూజించి, అర్చించండి. భార్య స్థానము నందు బుధ, శుక్ర, గురులు ఉండటం వల్ల వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2016 నందు మీకు వివాహం అవుతుంది. 2015 నుంచి కుజ మహర్దశ ప్రారంభమైంది.

ఈ మహర్దశలో మీకు పితృ వియోగం జరిగింది. ఈ కుజుడు 2016 నుంచి 2022 వరకూ అభివృద్ధిని ఇస్తాడు. మీ తల్లిగారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. సింధూర గణపతిని పూజించి, అర్చించడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఏదైనా ఉద్యానవనంలో మోదుగ చెట్టును నాటిన పురోభివృద్ధి పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. చెరో మూడేసి రోజులు.. బాండ్‌పై సంతకం

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

మహాశివరాత్రి: టీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు-అరుణాచలేశ్వరంకు ప్యాకేజీ.. ఎంత?

తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments