26-11-2021 శుక్రవారం మీ రాశిఫలాలు : పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (04:00 IST)
మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కాలం అసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.
 
వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరశ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో అనుకూలత, కొత్త అనుభూతికి లోనవుతారు.
 
మిధునం :- దైవకార్యాలు, వనసమారాధనల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుంది. ఒత్తిడి, శ్రమాధిక్యత వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారమవుతుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
సింహం :- ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఆశాజనకంగా ఉంటుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది.
రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు. 
 
కన్య :- ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రసంసలు పొందుతారు. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు.
 
తుల :- శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. లాయర్లకు, ఆడిటర్లకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఊహించని అవశాలు వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేట్ సంస్థల్లో వారు కోరుకునే మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
మకరం :- ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. చేతివృత్తులు, కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో సుఖశాంతులు సామాన్యంగా ఉంటాయి.
 
కుంభం :- స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలులు అధికమవుతాయి. విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సజావుగా సాగుతాయి. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. భాగస్వామిక వ్యాపారాలు, స్పెక్యులేషన్ నిరాశపరుస్తాయి.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments