Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-02-2022 శనివారం రాశిఫలితాలు - వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం...

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. అకాల భోజనం, శారీరకశ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఏ విషయానికి కలిసిరాని సోదరీ సోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలు ధనవ్యయం విషయంలో జాగ్రత్త వహించ వలసి ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయం గమనించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బంది పడతారు.
 
కర్కాటకం :- విదేశీ, రుణయత్నాలకు ఇది అనువైన సమయం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. క్రయ విక్రయాలు వాయిదా పడుట మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. వాణిజ్య ఒప్పందాలు, వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు.
 
కన్య :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ప్రేమికుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి.
 
తుల :- రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు, నర్సులకు ఏకాగ్రత ముఖ్యం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలు కళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. వినోదాలు, కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్థత కనబర్చి అధికారుల గుర్తింపు పొందుతారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బంధు మిత్రుల నుంచి ధనసహాయ విషయమై ఒత్తిడి, మొహమ్మాటాలు అధికంగా ఉంటాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
మకరం :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. బ్యాంకు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఓర్పుతో పరిస్థితులను భరించండి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. బంధువులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కుంభం :- వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థినులు భయాందోళనలు వీడి పట్టుదలతో శ్రమించాల్సి ఉంటుంది.
 
మీనం :- బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయ కార్యార్థం ప్రయాణం చేయవలసి వస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments