Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-04-22 మంగళవారం రాశిఫలాలు - సింధూర అర్చన చేసినా సర్వదా శుభం...

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఏ వ్యక్తికీ హామీ ఉండటం మంచిది కాదు. షేర్లు, సిరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా శ్రమించి అధికారులను ఆకట్టుకుంటారు. కీలకమైన బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. దంపతుల మధ్య కలహాలు, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహరాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు.
 
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు బంధువుల వైపు నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. భూ వివాదాలు, కోర్టు వ్యవహరాలు పరిష్కారం కాగలవు. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. నూతన ప్రాజెక్టులు, వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ఆంతరంగి వ్యవహరాలు గోప్యంగా ఉంచండి. స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో జయం పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం :- ప్రైవేటు సంస్థల్లో వారికి ఒర్పు, సహనం ఎంతో అవసరం. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది. కొత్త రుణాల కోసం యత్నిస్తారు.
 
కన్య :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి. రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. రుణాలు స్వీకరిస్తారు. గత తప్పిదాలు పునరావృతంకాకుండా జాగ్రత్త వహించండి.
 
తులు :- ఆర్థిక, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతలు గురవుతారు. ప్రయాణాలు అనుకూలం. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం మంచిది.
 
వృశ్చికం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంకాగలవు. గౌరవ మర్యాదలు, ఉన్నత పదవులు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక ఫలిస్తుంది. ప్రముఖులతో పరుచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చుకానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
మీనం :- కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తోటివారి నుంచి స్వల్ప పేచీలు ఉండగలవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోవటం వలన ఒకింత ఒత్తిడికి గురవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments