Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-01-2024 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

రామన్
బుధవారం, 31 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య బ॥ పంచమి ఉ.8.22 హస్త రా.10.08 ఉ.శే.వ.6.45 కు. పదు. 11. 43 ల 12.26.
సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- గతంలోనిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సన్నిహితుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. 
 
వృషభం : - ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ప్రయాణాలలో మెళకువ అసవరం.
 
మిథునం :- ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్ధులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం :- ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ అవసరం. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోనివారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
 
సింహం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వల్ల చికాకులు తప్పవు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివి తేటలతో ముందుకుసాగి జయం పొందండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధ బాంధవ్యాలు నెలకొని ఉంటాయి. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి.
 
తుల :- బంధు మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదపడుట మంచిది. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ప్రయోజనకరమైన విషయాలు చర్చించి సత్ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు.
 
వృశ్చికం :- ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంతృప్తి పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- గృహోపరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మకరం :- స్త్రీలతో కలహములు, అన్నికార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం :- పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్ధినులకు ఏకాగ్రతా లోపం వల్ల ఆందోళన తప్పదు. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు.
 
మీనం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. బంధువులను కలుసుకుంటారు. వైద్యుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments