Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-09-2024 ఆదివారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో జాగ్రత్త.. వాదనలకు దిగవద్దు...

రామన్
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. పనులు సాగవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ అంతగా పట్టించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో వ్యతిరేకత ఎదురవుతుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. గృహమార్పు అనివార్యం. ప్రయణం విరమించుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దంపతుల మధ్య అవగాహన లోపం. పంతాలకు పోవద్దు. పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు. ఖర్చులు సామాన్యం. సాఫ్ట్‌వేర్ విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుక్నుది సాధిస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు, వస్తువులు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపడతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంతానానికి శుభయోగం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కలిసివచ్చి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. విందులకు హాజరవుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. పంతాలకు పోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్ర వహించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments