Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-04-2023 తేదీ శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని పూజించిన...

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైనకాలం. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధనం బాగా ఖర్చు చేస్తారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నూతన పెట్టుబడులు పట్టునపుడు మెలకువ వహించండి.
 
మిథునం :- పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు.
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సహకరం. స్త్రీలకు షాపింగ్ విషయాలలోను, వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైనకాలం. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు.
 
సింహం :- వాతావరణంలో మార్పు వలన వ్యవసాయ, తోటల రంగంలో వారికి ఆందోళన తప్పదు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యులు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. తొందరపడి వాగ్దానాలు చేయటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం.
 
కన్య :- స్థిరాస్తి వాదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలు భేషజాలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించటం క్షేమదాయకం. మందులు, రసాయనిక, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసిరాగలదు.
 
తుల :- శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం :- పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. దంపతుల మధ్య చిన్న చిన్నకలహాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
 
ధనస్సు :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. గృహ భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలుచేపడతారు.
 
మకరం :- మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయమవుతాయి.
 
కుంభం :- ఉమ్మడి వ్యాపారాలు లాభదాయకంగా ఉండగలవు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవం కుదరదు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
మీనం :- గృహవాస్తు దోష నివారణలు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. వాదోపవాదాలకు, బ్యాంకు హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. కొత్తపనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments