Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-10-2022 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరిని పూజిస్తే శుభం...

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరించడి. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరగలదు.
 
మిథునం :- మిత్రులను కలుసుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. 
 
కర్కాటకం :- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పని భారం అధికం. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకతతప్పదు.
 
కన్య :- దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- విదేశాలు వెళ్ళాలి అనే అలోచనను క్రియారూపంలో పెట్టండి. స్నేహితులు, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలస్యమైన అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృశ్చికం :- ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అయినవారి సలహా తీసుకోవటం మంచిది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలను ఎదుర్కొంటారు. కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు :- రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లుతప్పవు. మీ మనోసిద్దికి ఇది సరైన సమయం అని గమనించగలరు. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
మకరం :- పండ్ల, పూల, కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. స్త్రీలు తాము అనుకున్నది సాధించగలుగుతారు. పొట్ట, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికం. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసివస్తుంది. ఇతరులకు సలహాలిచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
కుంభం :- స్త్రీలకు అనుకోని అభివృద్ధి, గుర్తింపు, రాణింపు లభిస్తాయి. పాత వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తేగలగుతారు. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి.
 
మీనం :- రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులౌతారు. వివాదాస్పదాలలో తలదూర్చకండి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. క్రీడల పట్ల, వస్తువుల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments