Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-09-2023 మంగళవారం రాశిఫలాలు - వరసిద్ధి వినాయకుడిని గరికెతో పూజించిన శుభం..

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ ద్వాదశి రా.11.15 శ్రవణం ఉ.7.45 ధనిష్ట తె.6.05 ప.వ.11.29 ల 12.58. ఉ.దు. 8.16 ల 9.06 రా.దు. 10.49 ల 11.35.
 
వరసిద్ధి వినాయకుడిని గరికెతో పూజించిన శుభం, జయం చేకూరుతుంది
 
మేషం :- ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి.
 
వృషభం :- ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాలవారికి పని భారం బాగా పెరుగుతుంది.
 
మిథునం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీరు చేయని కొన్నిపనులకు మీద నిందలు మోపే అవకాశం ఉంది. 
 
కర్కాటకం :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ నాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి.
 
సింహం :- ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవటం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. ముఖ్యుల రాకపోకలు అధికం కావడం వల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందేసమయం ఆసన్నమవుతుంది. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
కన్య :- కొబ్బరి, పండ్ల, పూలు పానీయ, కూరగాయల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆలయ సందర్శనాలతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారు. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు.
 
తుల :- ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు, ప్లీడర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు పురోభివృద్ధి, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి చికాకు తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు. వైద్యులకుసత్కాలం.
 
వృశ్చికం :- వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయ పరిచయాలు లబ్ధినిచేకూరుస్తాయి. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరిలబ్ది పొందుతారు.
 
ధనస్సు :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.
 
మకరం :- ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు.
 
కుంభం :- గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు స్థానచలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మీనం :- పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటిమాటలు అసహనం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments