Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-07-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

Webdunia
సోమవారం, 25 జులై 2022 (04:00 IST)
మేషం :- మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం వంటివి తలెత్తుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు, ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులకు తరుణం కాదు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
కర్కాటకం :- ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు.
 
సింహం :- దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పన్ను చెల్లింపుల్లో మెలకువ వహించండి. జూదాల జోలికి పోవద్దు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
 
కన్య :- కుటుంబ పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. సోదరుల మాటతీరు కష్టమనిపిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాహనచోదకులకు సమస్యలెదురవుతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు.
 
తుల :- స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- ఆత్మస్టెర్యంతో మెలగండి. విమర్శలు పట్టించుకోవద్దు. కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నం వాయిదా పడటం మంచిది.
 
ధనస్సు :- ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. స్త్రీలు పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సందర్భానుసారంగా వ్యవహరించి ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రోజులు సామాన్యంగా గడుస్తాయి. ధనం బాగా వ్యయం చేసినా ఫలితంఉండదు.
 
మకరం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను ఆకట్టుకుంటారు. చిన్ననాటి వ్యక్తుల సహాయం అందుతుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలో సోదరులతో విభేదిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

విశాఖ నక్షత్రంలోకి సూర్యుని పరివర్తనం.. 3 రాశులకు అదృష్టం

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

తర్వాతి కథనం
Show comments