Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-06-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం..

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (04:00 IST)
మేషం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానులు అపోహలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
వృషభం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. మామిడిపండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
మిథునం :- స్త్రీలకు అకాల భోజనం వలన ఆర్యోగంలో చికాకులు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం :- విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన తప్పదు.
 
సింహం :- స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యారంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల నష్టపోతారు. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికిమార్పులు అనుకూలిస్తాయి.
 
కన్య :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్య సేవలు తప్పవు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలం గడుపుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
తుల :- స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ కుటుంబీకులపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. వ్యవసాయ, తోటల రంగాలవారికి వాతావరణం అనుకూలిస్తుంది.
 
వృశ్చికం :- దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బంధువులు నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.
 
ధనస్సు :- శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఐరన్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి.
 
మకరం :- మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏజెన్సీ, నూతన కాంట్రక్టుల విషయంలో పునరాలోచన అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
కుంభం :- బంధువులతో విరోధాలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి వినియోగించాల్సి వస్తుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలురావచ్చును.
 
మీనం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్నా సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments