Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-05-2023 బుధవారం రాశిఫలాలు - సంపాదనకు మించి ఖర్చులు ఉంటాయి...

Webdunia
బుధవారం, 24 మే 2023 (04:00 IST)
మేషం :- ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.
 
వృషభం :- తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చీటికి మాటికి విసుక్కోవటాలు వంటివి చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సంపాదనకు మించి ఖర్చులు ఉంటాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించి ప్రసంశలను పొందుతారు.
 
కర్కాటకం :- మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశంఉంది.
 
సింహం :- మీ సంతానం ఉన్నత విద్యల కోసం కొంత మొత్తం పొదుపు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు లభిస్తాయి.
 
కన్య :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో మీలో విసుగు, చికాకులు, ఆందోళన చోటుచేసుకుంటాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాజనకం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
 
తుల :- ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దూర ప్రయాణాలలో అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలుకొనుట మంచిది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు.
 
మకరం :- వైద్య రంగాల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. మీ బంధువులు పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. కుటుంబీకులతో ఏకభవించలేకపోతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఖర్చులు అధికమవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపురాణింపు లభిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను పూర్తి చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments