Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-03-2024 ఆదివారం దినఫలాలు - విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు...

రామన్
ఆదివారం, 24 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు|| చతుర్ధశి ఉ.9.28 పుబ్బ ఉ.7.21 ప.వ.3.20ల5.07. సా.దు. 4.29 ల 5.16.
 
మేషం :- లిటిగేషన్ వ్యవహరాల్లో మొహమ్మాటాలకు పోవటం మంచిది కాదు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. మీపై మిత్రుల వ్యాఖ్యల ప్రభావం అధికంగా ఉంటుంది.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఖర్చులు రాబడికి తగ్గట్టుగానే ఉంటాయి. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కాకపోవటంతో నిరుత్సాహం చెందుతారు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మిథునం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
కర్కాటకం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత విడనాడిన సత్ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
సింహం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరుల గురించి యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. కొత్తబాధ్యతల చేపట్టే ఆస్కారంఉంది. బంధు మిత్రుల రాక మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం, విద్యార్థులు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత వహించకపోవడంతో ఆందోళనకు గురవుతారు.
 
తుల :- ఆర్థికలావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయంలో సంతృప్తి కానరాగలదు. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి.
 
వృశ్చికం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆలయాలను సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల, ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు.
 
ధనస్సు :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ దర్శనాలు అనుకూలం. అందరితో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలోను మెళకువ వహించండి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉపాధ్యాయు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
 
కుంభం :- సతీసమేతంగాఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

తర్వాతి కథనం
Show comments