Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-10-2022 ఆదివారం దినఫలాలు - ఎర్ర మందారంతో పూజించిన శుభం, జయం...

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికం. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ప్రయాణాలలో జయం చేకూరుతుంది.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు పెరిగినా ఆర్ధిక వెసులుబాటు ఉంటుంది. ఆడంబరాలు, వ్యసనాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
 
మిథునం :- మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. దైవ కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహారించడం వల్ల చిక్కుల్లో పడతారు.
 
కర్కాటకం :- మీ సంల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. మీ ప్రమేయం లేకూండానే కొన్ని విషయాల్లో మాటపడవలసివస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తిని కనపరుస్తారు. బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
సింహం :- రావలసిన ధనం అందటంతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. రవాణా రంగంలో వారికి చికాకులు తప్పవు. తొందరపడి వాగ్దానాలు చేయుట వలన మాటపడక తప్పదు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యానాలు కలవరపరుస్తాయి.
 
కన్య :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
తుల :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించండి. కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు మంచిది కాదు అని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయం. వివాహ నిశ్చితార్థాలు, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రుణాలు తీరుస్తారు. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. ఏ పని సక్రమంగా సాగక విసుగు కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశం ఉంది.
 
ధనస్సు :- విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరచిపోయే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ధనం చేతికందుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
మకరం :- మీ కార్యక్రమాలు, పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై సెంటిమెంట్లు, బంధురీవుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరం. 
 
కుంభం:- మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది.
 
మీనం :- మీరంటే కిట్టని వారు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ధనార్జన, ఆస్తుల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడ, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దల మాటను శిరసా వహిస్తారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments