Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-07-2022 శనివారం రాశిఫలాలు ... అభయ ఆంజనేయస్వామిని తమలపాకులతో

Webdunia
శనివారం, 23 జులై 2022 (04:05 IST)
మేషం :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
వృషభం :- భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. మతిమరుపు కారణంగా ఇబ్బందు లెదుర్కుంటారు.
 
మిథునం :- కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తి నివ్వజాలవు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు అయిన వారినుండి ఆదరణ, సహాయం లభిస్తాయి. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి.
 
కర్కాటకం :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. కార్యసాధననలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం వల్ల జయం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం ఒకందుకు మంచిదే. నూతన వ్యక్తుల విషయంలో మోసపోయే ఆస్కారం ఉంది.
 
సింహం :- వృత్తి, ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేస్తారు. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. బిల్డర్లకు చికాకులు తప్పవు. దైనందిన కార్యక్రమాలలో మార్పుండదు. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. 
 
కన్య :- కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికమవుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. 
 
తుల :- బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలు అపోహలవల్ల మాటపడక తప్పదు.
 
వృశ్చికం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో మెళకువ వహించండి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
 
ధనస్సు :- చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశంఉంది. జాగ్రత్త వహించండి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
మకరం :- ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఋణ యత్నం వాయిదా పడతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కిరాగలవు.
 
కుంభం :- రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం.
 
మీనం :- మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచన లుంటాయి. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments