Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-11-2022 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ముఖ్యుల పట్ల ఆహంకారం వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
వృషభం :- చేతిలో ధనం నిలవటం కష్టమవుతుంది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు బహుమతులను అందుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులనుఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయం. పెట్టుబడులు పెటేందుకు మాత్రం అనుకూలం కాదు. 
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం నిదానంగా కుదుటపడుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆఫీసులో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పీచు, నార, లెదర్, ఫోము వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును.
 
కర్కాటకం :- వస్త్ర, లోహ, బంగారు వ్యాపారులకు కలిసివచ్చే కాలం. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రైవేటు సంస్థలలోనివారికి తోటివారితో లౌక్యం అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
సింహం :- స్త్రీలు పని దృష్ట్యా ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో ఏకాగ్రత చాలా అవసరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య :- ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. మీపై అధికారులు మీ శ్రమను, మీ నేర్పరితనాన్ని గుర్తించడం లేదని దిగులుపడతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో సమస్యలు, శ్రమాధిక్యత వంటి చికాకులను ఎదుర్కొంటారు. ధైర్యం గలిగినప్పుడు శారీరక అనారోగ్యం మిమ్మల్ని ఏమీచేయనే లేదు. ఐ.టి. రంగాల్లో వారికి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు బహుమతులను అందుకుంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక ప్రయాణాల్లో నూతన పరిచయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
ధనస్సు :- ఉద్యోగస్తులు తోటివారి ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీరెదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. కుటుంబీకుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు మొదలెడతారు. నిరుత్సాహపరులైన స్నేహితులను దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు సంఘంలోను, బంధువులలోను ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. కాంట్రక్టర్లకు నూతన టెండర్లు చేజారిపోతాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం :- అథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానం విషయంలో తగు జాగ్రత్తతో ఉండండి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. 
 
మీనం :- రుణ బాధలు తొలగిపోతాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ప్రేమికుల అతి ప్రవర్తన అనర్ధానికి దారితీస్తుంది. విలువైన కానుకలను అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Bathukamma: బ్రెజిల్ రియో ​​కార్నివాల్ స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం: జూపల్లి

వినాయక చవితి పండుగ తర్వాత గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

తర్వాతి కథనం
Show comments