Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

రామన్
గురువారం, 20 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన విజయాలున్నాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకుసాగవు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన తొలగి కుదుటపడతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మొదటికే వస్తాయి. నిరుత్సాహం వీడి శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతములను కలుసుకుంటారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. ఖర్చులు అధికం. తలపెట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ప్రయాణం సజావుగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

తర్వాతి కథనం
Show comments