Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-02-2024 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

రామన్
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ దశమి ఉ.11.58 మృగశిర ప.1.38 రా.వ.10.17 ల 11.56. ప.దు. 12.36 ల 1.21 పు.దు. 2. 52 ల 3.37.
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు సంతృప్తినిస్తుంది. టీ.వీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు. మీసంతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు, తరుచు ప్రయాణాలు తప్పవు. ముఖ్యుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం :- అనుకున్న పనులు వాయిదా వేయడటం మంచిది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించట వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపు ఉండదు. ఫ్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 
సింహం :- ఎదుటి వారి విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల ఇబ్బందు లెదురవుతాయి. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిట్స్, ప్రైవేటు ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. మిమ్మల్ని అవహేళన చేసినవారు మీ సహాయం ఆర్ధిస్తారు. పాతమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రేమికులు ప్రతి విషయంలో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది.
 
తుల :- శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రావలసిన ధనం సకాలంలో అందుట వలన పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
వృశ్చికం :- రవాణా రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రాజీ ధోరణితో వ్యవహరించటం వల్ల ఒక సమస్యపరిష్కారమవుతుంది.
 
ధనస్సు :- విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరతాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ప్రయాసలు అధికం. వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మకరం :- వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మిమ్ములను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టటం ఉత్తమం. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
కుంభం :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చివరిక్షణంలోచేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపు ఉండదు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం.
 
మీనం :- వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం కోసం ధనం అధికంగాఖర్చు చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు తీరతాయి. వృత్తుల వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగంచేసుకోవటం మంచిది. గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

తర్వాతి కథనం
Show comments