Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-11-2024 శనివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

రామన్
శనివారం, 16 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. పనులు పురమాయించవద్దు. ప్రయాణం విరమించుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ సలహా కొందరికి ఉపకరిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కొత్త ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులెదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది, ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఒంటెద్దు పోకడ తగదు. సన్నిహితుల జోక్యం అనివార్యం. ఖర్చులు విపరీతం, శుభకార్యానికి హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు.. ఆదాయం 2, వ్యయం 14

తర్వాతి కథనం
Show comments