Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

రామన్
శనివారం, 14 డిశెంబరు 2024 (04:00 IST)
Today Daily Astro మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా అడుగులేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. రోజువారి ఖర్చులే ఉంటాయి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మీ శ్రీమతిలో మంచి మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు అప్పగించవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఖర్చులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. కీలక పత్రాలు అందుకుంటారు. సేవ, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలందుకుంటతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పందాలు, పోటీల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. చాకచక్యంగా మెలగండి. అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో ఒత్తిళ్లకు గురికావద్దు. ఓర్పు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. సోదరుల మాటతీరు అసహనం కలిగిస్తుంది. పెద్దల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు.. ఆదాయం 2, వ్యయం 14

తులారాశి 2025 రాశిఫలితాలు.. వరసిద్ధి వినాయకుని ఆరాధన చేస్తే?

తర్వాతి కథనం
Show comments