14-09-2025 ఆదివారం దినఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం

రామన్
ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (05:00 IST)
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయును కలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆహ్వానం అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, ఆభరణాలు, జాగ్రత్త. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ప్రశంసలందుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్తయత్నాలు చేపడతారు. అందరితోను మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరాణాలు జాగ్రత్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments