Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

రామన్
బుధవారం, 14 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్ధికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితులు ప్రోత్సహిస్తారు. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పనులు ముందుకు సాగవు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణం తలపెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
లావాదేవీల్లో అప్రమత్తంగాఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ధన సమస్యలు ఎదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితం ఉంటుంది. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. నోటీసులు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

తర్వాతి కథనం
Show comments