Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-10-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

Advertiesment
venkateswara swamy
, శనివారం, 1 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. మీ సంతానం మొండితనం అసహనానికి గురవుతారు. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనంబాగా వెచ్చిస్తారు. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిథునం :- స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులు అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్య లెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
కర్కాటకం :- మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కలిసిరాగలదు. దీక్షలు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
సింహం :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు కలిసిరాగలదు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 
కన్య :- తరచూ సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. బిల్డర్లకు చికాకులు తప్పవు. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రావలపిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. బంధు మిత్రుల రాకపోకలు అధికం.
 
తుల :- నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రుణయత్నాల్లో అనుకూలత లుంటాయి. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచండి. 
 
ధనస్సు:- తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు, ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి.
కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- వృత్తుల వారికి అన్ని విధాలా కలిసి రాగలదు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితనానికి ఇది పరీక్షా సమయం. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. దైవ దీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకం. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
 
కుంభం :- ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. బాకీలు వసూలు కాకపోవటంతో ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికమువుతాయి. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-10-2022 నుంచి 31-10-2022 వరకు మీ మాస రాశిఫలాలు- ఈ మాసం శుభాశుభాల మిశ్రమం