Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

రామన్
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య ఆకారణ కలహం. చీటికిమాటికి చికాకుపడతారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్తలు ఎదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడాద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఆకాలభోజనం, విశ్రాంతి లోపం. స్థిమితంగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నం ఫలిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు విపరీతం. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మాట నిలబెట్టుకుంటారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అప్పగించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పత్రాల్లో మార్పు చేర్పులు అనుకూలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

భార్యను బాధపెట్టేవాడు ఏమవుతాడు? గరుడ పురాణంలో ఏముంది?

కల్కి జయంతి: కల్కి రాకతో కలియుగం అంతం.. సత్యయుగం ప్రారంభం అవుతుందట

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

తర్వాతి కథనం
Show comments