Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-11-2024 శుక్రవారం రాశిఫలాలు - పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు...

రామన్
శుక్రవారం, 8 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువ అవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ కించపరచవద్దు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కృషి ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. పనులు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నోటీసులు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచింపవద్దు. ప్రియతములతో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దైవ, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తన పుట్టుకనే శంకించారు... వైఎస్ఆర్‌కు పుట్టలేదంటూ ప్రచారం.. వైఎస్ షర్మిల

ఉన్నపరువు పోతుందని ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా దూరం!!

కుమార్తెకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన భార్య.. హత్య చేసిన భర్త...

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

విశాఖ నక్షత్రంలోకి సూర్యుని పరివర్తనం.. 3 రాశులకు అదృష్టం

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

తర్వాతి కథనం
Show comments