Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

రామన్
గురువారం, 8 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. అనవసర జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఒప్పందాలకు అనుకూలం. ప్రముఖుల సలహా పాటిస్తారు. ధనలాభం ఉంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భేషజాలకు పోవద్దు. రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు ముందుకు సాగవు. సోదరి సోదరులతో విభేదిస్తారు. ఆస్తి వివాదాలు జఠిలమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చేపట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల్లో మార్పలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా ఉంటుంది. ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో మెలగండి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments