Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేదీ 07-02-2023 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోసిద్ధి..

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయం గమనించండి. ప్రవేట్ చిట్‌దారులు చిక్కుల్లో పడే అస్కారం ఉంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సలహా ఇచ్చే వారే కాని సహకరించే వారుండరు. టీ.వీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కష్టసమయంలో ఆత్మీయులు తోడుగా నిలుస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరుల వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక విషయంలో సోదరుతో విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలను పొందుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం.
 
కన్య :- స్త్రీల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు శారీరకపటుత్వం నెలకొంటుంది. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. రవాణా రంగాలవారికి సమస్యలు తలెత్తుతాయి. రహస్యాన్ని దాచలేని మీ వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
తుల :- కళలు, రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత అవసరం. 
 
వృశ్చికం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండగకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఆలస్యంగా అయినా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ పనితీరు, విధేయతలు అధికారులను ఆకట్టుకుంటాయి.
 
మకరం :- మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. మీ ఆలోచనలను గోప్యంగా ఉంచిగుట్టుగా యత్నాలు సాగించాలి. ఎల్.ఐ.సి ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌ల టార్గెట్ పూర్తవుతుంది. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కుంభం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ యత్నాలో నిర్లక్ష్యం, పనులు వాయిదా కూడదు. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార రహస్యాలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత మెళుకువ అవసరం. చిన్న తప్పిదాలే సమస్యగా మారే ఆస్కారం ఉంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు, షాపింగ్లోను అప్రమత్తత అవసరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్‌1 బీ వీసాలకు అనుకూలమే.. తేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు..

Three Monkey Flexes: చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు.. ఆ ఫ్లెక్సీలు ఎందుకు?

Liquor Lovers: మద్యం ప్రియులకు శుభవార్త.. నో స్టాక్ అనే బోర్డు పెట్టరట

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments