05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

రామన్
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. పాత పరిచయస్తులను కలసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. వేడుకకు హాజరవుతారు.
 
మిథనం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోను కావద్దు. ధనసమస్య ఎదురవుతుంది. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. అప్రమత్తంగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితును కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణవిముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు ఒక పట్టాన సాగవు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, సాయం అర్ధించేందుకు మనస్కరించదు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

తర్వాతి కథనం
Show comments