Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

ఠాగూర్
గురువారం, 5 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణం తలపెడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం ఉంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం వృధాకాదు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకం. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. మీచొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు అతికష్టంమ్మీద సంపాదిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో ఒత్తిళ్లకు గురికావద్దు. ఆచితూచి అడుగేయండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. కొంతమొత్తం ధనం అందుతుంది. తలపెట్టిన పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల హితవు మీపై పనిచేస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

తర్వాతి కథనం
Show comments