Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-03-2024 మంగళవారం దినఫలాలు - అవివాహితుల్లో నూతనోత్సాహం...

రామన్
మంగళవారం, 5 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ బ|| దశమి రా.1.37 మూల ఉ.11.24 ఉ.వ.9.48 ల 11.24
రా. . 8.45 ల 10.19. ఉ. దు. 8.40 ల 9.27 రా.దు. 10.57 ల 11.46.
 
మేషం :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
వృషభం :- ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపంవంటి చికాకులు అధికం. కార్యసాధనలో జయం పొంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానంపై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు నిరుత్సాహం తప్పదు. 
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. మీ ప్రమేయంతో అయిన వారి సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పంతాలకు పోకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత, మెళకువ అసవరం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
సింహం :- స్త్రీలు విలువైన వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారాల వలన సమసిపోగలవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. సన్నిహితులతో కలసి సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
తుల :- రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకుకలిగిస్తుంది. స్త్రీలలో మూలక సమస్యలు తలెత్తుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉత్తరా ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ ధైర్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
ధనస్సు :- ఉద్యోగస్తులు పనిలో ఉండే ఒత్తిడి తగ్గి ప్రశాంతతను పొందుతారు. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలలో మెళకువగా వ్యవహరించడం మంచిది. కిరాణా, వస్త్ర వ్యాపారులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం :- కాంట్రాక్టర్లకు పనివారితో మెళకువ అవసరం. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
కుంభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. శ్రమకు తగిన ఫలితందక్కుతుంది.
 
మీనం :- వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. దంపతుల మధ్య అమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. పాత వస్తువుల వల్ల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు తోటివారితో మితంగా వ్యవహరించడం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments