Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-08-2024 శనివారం దినఫలాలు - కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు....

రామన్
శనివారం, 3 ఆగస్టు 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ॥ చతుర్ధశి ప.3.35 పునర్వసు ప.12.48 రా.వ.9.09 ల 10.49. ఉ. దు. 5.42 ల 7.24.
 
మేషం :- కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. నూతనవ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. దూర ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లిప్తత తప్పవు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళుకువ వహించండి. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు పురోభివద్ధి. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువులు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. వాగ్వివాదాలకు, పంతాలకు పోకుండా కొన్ని వ్యవహారాలు మీరే చక్కబెట్టుకోవలసి ఉంటుంది.
 
మిథునం :- నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి అసహనం ఎదురవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు చోటుచేసుకుంటాయి.
 
కర్కాటకం :- ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి అభివృద్ధి దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులలో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి నూతన యత్నాలు మొదలెడతారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. ఖర్చులు అధికం. ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదుర్కుంటారు. 
 
సింహం :- రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వాహనయోగం, వస్త్రప్రాప్తి వంటి శుభసూచనలున్నాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
 
కన్య :- ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె, తేయాకు, కాఫీ రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమరుపాటుతనం కూడదు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిర్మాణ పనులు మందకొడిగాసాగుతాయి.
 
తుల :- బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి నుండి సహాయం లభించకపోవటంతో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం :- కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత ఆందోళన తప్పదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విపరీతంగా వ్యయం చేయవలసి వస్తుంది.
 
ధనస్సు :- వ్యవసాయ, తోటల వ్యాపారస్తులకు వాతావారణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వలన కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు లాభదాయకం. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ మొండివైఖరి వదిలి ప్రశాంత వహించుట మంచిది.
 
కుంభం :- ఒక వ్యవహారంలో బంధు మిత్రుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికం. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు.
 
మీనం :- తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఆశించిన విధంగా సాగుతాయి. విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments